హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వే మంత్రితో భేటీకి జగన్ వర్గం ఎంపీలు డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari-Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి దినేష్ త్రివేదితో సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు. వైయస్ జగన్ సరేసరి, ఆయన వస్తారని కూడా ఎవరూ అనుకోరు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై పార్లమెంటు సభ్యులు తమ ప్రతిపాదనలను మంత్రి ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఈ సమావేశానికి హాజరయ్యారు. మెదక్ - అక్కన్నపేట రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రి అంగీకరించారని ఆమె సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరిస్తామని, కావాల్సిన భూమిని కూడా ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఆమె తెలిపారు.

ఖాజీపేటలో రైల్వే వ్యాగన్ల ప్రాజెక్టును పెట్టాలని కోరినట్లు రాజయ్య చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని టి. సుబ్బిరామి రెడ్డి కోరారు. ఎంఎంటిఎస్ రెండో దశకు నిధులు విడుదల చేయాలని, వైజాగ్ వాల్తేరు డివిజన్‌గా విభజించాలని సత్యవతి రాథోడ్ కోరారు. రైల్వే విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని జి. వివేక్ అన్నారు. కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, వనబాక లక్ష్మి, పలువురు పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప కూడా సమావేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశానికి రాలేదు. ఈ సమావేశానికి ముందు ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress president YS Jagan camp MPs Sabbam Hari and Mekapati Rajamohan Reddy skipped the meeting with Railway Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X