ముంబయి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరేపై మహారాష్ట్ర పోలీసులు మంగళవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడినందుకు గాను తాము కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలకు 48 గంటల ముందు నుండి ఏ విధమైన ప్రచారం చేయకూడదు. అయితే రాజ్ ఓ మరాఠీ ఛానల్‌లో మాట్లాడారు. రాజ్ థాకరేతో పాటు సదరు న్యూస్ ఛానెల్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ బిఎంసి అధికారి ఫిర్యాదు మేరకు రాజ్, సదరు ఛానల్ పైన 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా పది సివిక్ బాడీ ఎన్నికలతో పాటు బ్రిహన్ ముంబయి మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కాగా శివసేన అధినేత బాల్ థాకరేకు రాజ్ కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. రాజ్‌ను శివసేనలోకి రావాల్సిందిగా బాల్ థాకరే ఆహ్వానించడంపై స్పందిస్తూ మీరే మా పార్టీలోకి రండి అంటూ కౌంటర్ వేశారు.
FIR has been registered against the Maharashtra Navnirman Sena chief Raj Thackeray and a leading Marathi news channel for allegedly violating model code of conduct ahead the civic polls, police said on Wednesday.
Story first published: Wednesday, February 15, 2012, 13:30 [IST]