చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ పంజా: డిఎంకె మాజీ మంత్రిపై విజిలెన్స్ దాడులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మరోసారి తన మార్క్ రాజకీయం ప్రదర్శించారు. డిఎంకె మాజీ మంత్రి తంగం తెనెరసు ఇంటి పైన ఆయన కార్యాలయాల పైన విజిలెన్స్ బుధవారం దాడులు నిర్వహించింది. మాజీ మంత్రితో పాటు పలు ప్రాంతాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ దాడులు నిర్వహిస్తున్నారు. తంగం 2006 నుండి 2011 మధ్య విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో తాము దాడులు నిర్వహిస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్తెలిపింది. విజిలెన్స్ ప్రకారం ఆయన మంత్రిగా పని చేసిన సమయంలో లక్షల రూపాయలు సేకరించారు.

విజిలెన్స్ తంగంపై కేసు నమోదు చేసింది. చెన్నై పరిసర ప్రాంతాలు, తంగం ఇళ్లు, విరుధునగర్‌, మధురై, దిండిగుల్ తదితర ప్రాంతాలలోని ఆయన బంధువుల ఇళ్లపై విజిలెన్స్ బుధవారం ఉదయం దాడులు చేసింది. కాగా మే 2011లో జయలలిత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో డిఎంకె నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు దురై మురుగన్, కెఎన్ నెహ్రూ, టిఎం అంబరసన్, కె పొన్ముడి, ఎన్ సురేష్ రాజన్, పొంగలూర్, ఎన్ పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితరులపై విజిలెన్స్ దాడులు చేసింది.

అయితే తమ నేత తంగం ఇల్లు, కార్యాలయాలపై దాడులు కక్ష సాధింపులో భాగమని డిఎంకె నేతలు అంటున్నారు. అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి జయలలిత తమ పార్టీ కార్యకర్తలను, నేతలను టార్గెట్‌గా చేసుకొని దాడులు నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దాడులను డిఎంకె తీవ్రంగా ఖండించింది. కాగా వచ్చే ఎన్నికల్లో ఈ దాడులనే తమ అజెండాగా పెట్టుకుంటామని డిఎంకె చీఫ్ కరుణానిధి ఇటీవలె చెప్పారు.

English summary
The homes of former DMK minister Thangam Thenarasu and his relatives were raided across several places in Tamil Nadu Wednesday for allegedly accumulating assets disproportionate to their known sources of income, said the Directorate of Vigilance and Anti-Corruption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X