కాంట్రాక్టులన్నీ డిసిఎం బావమరిదివే: బాబూ మోహన్

Babu Mohan
హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ నటుడు బాబూ మోహన్ ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలోని కాంట్రాక్టులన్నీ దామోదర రాజనర్సింహ బావమరిదివేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బోరింగ్ ప్లాట్‌ఫారం నిర్మాణం నుంచి కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టు కూడా దామోదర బావమరిదికి దక్కాల్సిందేనని, మరొకరికి దక్కనీయరని ఆయన అన్నారు.

మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహకు బినామీ మద్యం వ్యాపారాలున్నాయని ఆయన ఆరోపించారు. మద్యం వ్యవహారాల్లో దామోదర రాజనర్సింహ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయలను దామోదర రాజనర్సింహ కూడబెట్టారని ఆయన ఆరోపించారు. దామోదర రాజనర్సింహ అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల విషయంలో ఏమైనా మాట్లాడితే బెదిరింపులు తప్పడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+