న్యూఢిల్లీ: పితృత్వ కేసులో రక్త నమూనాలు ఇవ్వకుండా, డీఎన్ఏ పరీక్షలకు సహకరించకుండా మొండికేస్తున్న మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తివారీయే తన అసలు తండ్రి అని వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల మరో వైపు నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఉజ్వల భర్త బీపీ శర్మకు డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో బుధవారం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో చదివి వినిపించారు.
రోహిత్ డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని, ఆమె భర్త బీపీ శర్మతో సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ శర్మల బంధం వల్ల రోహిత్ జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న రోహిత్ వాదనకు బలం చేకూరింది. తివారీ రక్తనమూనాలు ఇస్తే ఆ విషయమూ బయటపడేదే. దీనిపై రోహిత్ ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీని పై సమాధానమివ్వాలటూ తివారీ న్యాయవాదిని ఆదేశిస్తూ జడ్జి కేసు విచారణను మార్చికి వాయిదా వేశారు.
A DNA report, placed before the Delhi high court on Wednesday, said that Rohit Sekhar, who claimed to be veteran Congress leader N D Tiwari's biological son, was not fathered by the man whom his mother had married.
Story first published: Thursday, February 16, 2012, 9:32 [IST]