అరెస్టు కావాల్సిన వ్యక్తి: సిఎం, బాబు ధీటైన జవాబు

అందుకు కిరణ్ మాట్లాడుతూ... తాను ఎమ్మార్ అంశం ప్రస్తావించగానే బాబు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు ఎగిరి పడుతున్నారన్నారు. బాబు స్ప్రింగ్‌లాగ ఎగురుతున్నారన్నారు. ప్రతిపక్షాన్ని అధికార పక్షం బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుందని బాబు ధ్వజమెత్తారు. నేను జైలుకు వెళ్లాల్సిన వాడినని సిఎం అన్నారని కానీ ఏనిమిదేళ్లుగా అధికారంలో ఉండి వారేం చేశారని ప్రశ్నించారు. తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని అన్నారు. హైటెక్ సిటి కట్టించింది మేమే అని అన్నారు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నన్నేమీ చేయలేరని బాబు అన్నారు. చంద్రబాబు వాస్తవాలు వినేందుకు సిద్ధంగా లేరని కిరణ్ అన్నారు. హైటెక్ గురించి మాట్లాడితే ఎమ్మార్ గురించి మాట్లాడాలని, ఎమ్మార్ గురించి మాట్లాడితే బాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు.
సిఎం ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం టిడిపి ఎమ్మెల్యేలు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. సిఎం చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సిఎం ప్రసంగం రెండుసార్లు ఆగిపోయింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ టిడిపికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి గొడవ చేయడం హుందాతనం కాదని, టిడిపి ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. టిడిపి ఎమ్మెల్యేల తీరును సిఎం తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications