హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుమారం రేపిన బాబు పిల్లల సభ్యత, సంస్కారం వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కాంగ్రెసు నేతల పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మద్యం సిండికేట్లపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ సందర్భంలో చంద్రబాబు కాంగ్రెసు నేతలు తమ పిల్లలను గాలికొదిలేశారని ఆరోపించారు. తన కొడుకు నారా లోకేష్ కుమార్, కోడలు బ్రాహ్మిణి విదేశీ యూనివర్సిటీలో చదివారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు శైలజానాథ్, కన్నా లక్ష్మి నారాయణ, మదుసూధన్ గుప్తా మండిపడ్డారు. చంద్రబాబు కాంగ్రెసు నేతల పిల్లలను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. సభ్యత, సంస్కారం విదేశీ యూనివర్సిటీల్లో చదివితే రాదన్నారు. కాంగ్రెసు నేతల పిల్లలకు కూడా సభ్యత, సంస్కారం ఉంటుందని బాబు తెలుసుకోవాలన్నారు. అనవసరంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు. నేతల పిల్లలను బాబు చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు.

కాగా బిజెపి నేత కిషన్ రెడ్డి సభలో మాట్లాడుతూ... మద్యాన్ని ఆదాయవనరుగా చూడవద్దని సూచించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు రెండు లక్షలకు పైగా ఉన్నాయని వాటన్నింటిని ఎత్తివేయాలన్నారు. పని మనుషుల పేరుతో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారాలు చేస్తున్నారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణ ఆరోపించారు. మంత్రి ధర్మాన పిఏ ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు వైయస్ అవినీతి కొనసాగిస్తోందన్నారు. సిఎం కిరణ్ మాత్రమే సిండికేట్లపై సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిదే అధికారం అన్నారు. తనను ఉద్దేశించి గాలి మాటలన్న కాంగ్రెసు నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గాలి మాటలంటే సుడిగాలిలో కొట్టుకు పోతారన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu comments in Assembly are turned to controversial today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X