'తెలంగాణ'ను బాబుపైకి నెట్టిన బొత్స, జగన్‌తో ఢీకి సై

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని అన్నారు. సభకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గెలుపోటములకు, జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పని తీరును తాను కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు వివరించానని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపోటములతో కాంగ్రెసుకు సంబంధం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో తాము ప్రచారానికి వెళ్తామన్నారు. ఉప ఎన్నికల్లో విజయంపై తమ కార్యాచరణ తమకుందని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications