సిఎంనూ వదలమన్న బాబు, ఊరుకోమన్న కిరణ్

Kiran Kumar Reddy-Chandrababu Naidu
హైదరాబాద్: మద్యం ముడుపుల అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. బాబు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు అడ్డు తగిలారు. మద్యం ముడుపులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎసిబి రిపోర్టులోని వాస్తవాలను సభ దృష్టికి తీసుకు రావాలని ఆయన అన్నారు. రూ.15వేల కోట్ల ముడుపులు అందాయన్నారు. మద్యం ముడుపులపై ప్రభుత్వానికి సిగ్గుంటే సమాధానం చెప్పాలి.. కానీ దాటవేత ధోరణి సరికాదన్నారు. ముడుపులతో సంబంధమున్న అధికారులు జైళ్లో ఉంటే నేతలు మాత్రం దర్జాగా బయట, సభలో ఉన్నారన్నారు. వాస్తవాలు ప్రభుత్వం తారుమారు చేసిందన్నారు. ఎసిబి 140 మంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయన్నారు. నున్నా రమణ కాంగ్రెసు నేత అని, ఆయన మీ పార్టీ నేతలకు ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. రాంరెడ్డి అనుచరుడు అన్నారు. అందుకు రాంరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ తనను వివాదంలోకి లాగవద్దన్నారు. మా అమ్మ కర్మకు 75వేల మంది వచ్చారని అన్నారు. రమణతో తనకు సంబంధం లేదన్నారు. ఖమ్మం వస్తే అక్కడ నిజానిజాలు తెలుస్తాయన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు... దోషులను కాంగ్రెసు పెంచి పోషించిందన్నారు. దోషులను దాచిపెట్టే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రిని కూడా తాము వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎసిబి నివేదికలో పేజీలు ఎందుకు తొలగించారన్నారు. ఏడో పేజీ ఎక్కడుందన్నారు. మంత్రులతో క్రిమినల్స్ ఉన్నారన్నారు. మద్యం నియంత్రణ చేయాల్సిన అవసరముందన్నారు. లేదంటే సమాజం నిర్వీర్యమవుతుందన్నారు. ఒక మంత్రిని కాపాడేందుకు మరొకరిని ఇరికించారని ఆరోపించారు. పేదవాడి జీవితంతో ప్రభుత్వం ఆడుకుందన్నారు. బాబు వ్యాఖ్యలపై సిఎం మండిపడ్డారు. ఏడో పేజీ ఎక్కడ మిస్ కాలేదని అన్నారు. ఏ పేజీలు మిస్ కాలేదని అన్నారు. పేజీలు ఎక్కడ పోయాయో ఆయనే చూపాలన్నారు. మీడియా కథనాలతో నిరాధార ఆరోపణలు చేయవద్దన్నారు. దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. అమాయకులను ఇరికించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్నారు. విషయం లేకుండా తమపై బురద జల్లితే ఊరుకునేది లేదన్నారు. ఆధారాలు ఉంటే బాబు సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టులో ఉన్న అంశంపై చర్చించేందుకు ఒప్పుకోవడానికి కారణం ప్రజల అపోహలు తొలగించేందుకేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+