ఛీ అంటే ఛీ!: సభలో టిడిపి, కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలు

Assembly
హైదరాబాద్: మద్యం ముడుపుల అంశంపై శుక్రవారం సభలో జరిగిన చర్చ పరస్పర దూషణల వరకు పోయింది. ముడుపుల అంశంపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేస్తున్న సమయంలో చర్చ ఒక్కసారిగా హీటెక్కింది. ఓ సమయంలో టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ మంత్రి కన్నా కొడుకు శంషాబాద్ విమానాశ్రయంలో రూ.50 కోట్ల అక్రమ రవాణాతో దొరికి పోయారని అలాంటి వ్యక్తి చెబితే మేం వినాలా అని అన్నారు. అందుకు ధీటుగా స్పందించిన కన్నా లక్ష్మీ నారాయణ గాలి కళాశాలను పేకాట క్లబ్‌గా మార్చారని ఎదురు దాడి చేశారు. అందుకు స్పందించిన గాలి... తాను ఏ కళాశాలను పేకాట క్లబ్‌గా మార్చలేదని.. ఆధారాలు ఉంటే పోలీసు కేసు నంబరు, అడ్రస్ ఇవ్వాలని అన్నారు. తనను అధికార పక్షం బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టాలని చూస్తుందన్నారు. నాకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డే కితాబిచ్చారన్నారు. మద్యం పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందన్నారు. ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే ఎసిబి రిపోర్టును బయట పెట్టడం లేదన్నారు. అందులో మంత్రుల పేర్లు ఉన్నాయన్నారు. దేశంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమన్నారు. అక్రమార్కులను శిక్షించాలన్నారు. ఓ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ నున్నా రమణ కాంగ్రెసు నేత అని, ఆయన ఆ పార్టీకి ప్రకటనలు ఇచ్చారన్నారు.

అందుకు కన్నా మాట్లాడుతూ... ఎవరో ఇచ్చిన ప్రకటనలకు తమ పార్టీ నేతను బాధ్యుడిని ఎలా చేస్తారన్నారు. ఎవరెవరో ఇస్తారు అది తమ బాధ్యత అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కోర్టులో ఉన్న అంశంపై సభలో చర్చించేందుకు సరేనన్నారన్నారు. ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశ్యం లేదన్నారు. సిఎంకు అలా ఉంటే ఇక్కడి వరకు వచ్చిది కాదన్నారు. ఓ సమయంలో కన్నా బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత మామకు వెన్ను పోటు పొడిచిన బాబు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అవినీతతో బతుకుతున్న బాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తొమ్మిదేళ్లు సిఎంగా పని చేశానని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కర్షక పరిషత్ నుండి ఎత్తాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు బాబు కొడుకు తప్పు చేసి పట్టుబడితే సమర్థించుకున్నారని మండిపడ్డారు. ఎసిబి దాకా వద్దని మొదట ముఖ్యమంత్రి మంత్రుల నైతికత చూసుకోవాలని సూచించారు. సిగ్గుంటే ప్రభుత్వం మద్యం ముడుపులపై సమాధానం చెప్పాలి కానీ దాటవేత ధోరణి సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+