హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ 1250కోట్ల పన్ను ఎగవేశారు: సాయి ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు రూ.1250 కోట్ల పన్ను ఎగవేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆన ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాయి రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచే పంపిన ఈ ఫిర్యాదుపై జైలర్ అటెస్టేషన్ కూడా ఉందని తెలుస్తోంది. రూ.3550 కోట్లపై పన్ను ఎగవేశారని సాయి రెడ్డి ఆరోపించారు. ఉషోదయ ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన షేర్ల లావాదేవీల గురించి తమ ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు.

నిబంధనల ప్రకారం పన్ను విధించాలని, మొత్తంగా రామోజీ రావు రూ.3550 కోట్లకు సంబంధించి ఆదాయంపై రూ.1250 కోట్ల మేరకు పన్ను ఎగవేశారని సాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు సంబంధించి ఇవే ఆరోపణలపై విచారణ జరిపారని చట్టం ముందు అంతా సమానమే అని రాజ్యాంగం చెబుతున్నందున, తాము ఇచ్చిన అతి కీలకమైన సమాచారం ఆధారంగా రామోజీ రావుపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ కమిషనర్‌ను కోరారు. ఈ ఫిర్యాదు పత్రంపై సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ కూడా సంతకం చేశారు.

English summary
Vijaya Sai Reddy complainted against Ramoji Rao to IT commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X