సిఎంను మార్చేదిలేదు: యడ్డీ అల్టిమేటంపై నితిన్ గడ్కరీ

కాగా తనను ఈ నెల 27లోగా ముఖ్యమంత్రిని చేయాలని యడ్యూరప్ప గురువారం అధిష్ఠానానికి ఆల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆలోగా తనకు సిఎం పదవి అప్పగించకపోతే కఠిన నిర్ణయం తప్పదని ఆయన హెచ్చరికలు పంపారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై రెండు రోజులు సాగే చింతన్ బైఠక్ కోసం శుక్రవారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గురువారం రాత్రే హుటాహుటిన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర పాడి పరిశ్రమ సమాఖ్య అధ్యక్ష పదవి కూడా దక్కించుకోలేక నిరాశలో మునిగిన గౌడను ఏరికోరి పీఠం ఎక్కిస్తే ఆయన తనకే ఎదురు తిరగడాన్ని యడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట.
ఈ మేరకు తన మద్దతుదారులైన 60 మంది ఎమ్మెల్యేలు సహా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 90 మందితో కీలక భేటీ కూడా నిర్వహించారు. పార్టీ ఇలా రెండు శిబిరాలుగా చీలిపోవడం గడ్కరీకి అగ్నిపరీక్ష కానుంది. సమస్యకు పరిష్కారంలో భాగంగా యడ్యూరప్పకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications