హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ విప్పిన ఆస్తుల చిట్టాపై చంద్రబాబు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. కెసిఆర్ పగలు ఒక పని రాత్రి ఒక పని చేస్తారని దుయ్యబట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే మరుసటి రోజు కెసిఆర్ అదే మాట్లాడతారని ఆరోపించారు. వారిద్దరి మధ్య లాలూచీ ఉందని అన్నారు. ఒకరి కాళ్లు పట్టుకోవడం కెసిఆర్‌కే అలవాటు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బాలాయపల్లిలోని భూమిని తాను ఎప్పుడో అమ్మేశానని చంద్రబాబు చెప్పారు. ఆ భూమికి సంబంధించిన ఆధారాలు ఏమైనా కెసిఆర్ వద్ద ఉంటే వాటిని ఆయనకే రాసిస్తానని సవాల్ విసిరారు. ఆ భూములపై గతంలోనే వివరణ ఇచ్చానని చెప్పారు. కెసిఆర్ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న విధంగా ఉంటుందని విమర్శించారు. ఆయన పొద్దున ఒకరకంగా రాత్రి మరోరకంగా మాట్లాడతారన్నారు.

మద్యం సిండికేట్లపై గవర్నర్ నరసింహన్‌ను కలిశామన్నారు. సిండికేట్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి ఆయన క్లీన్ చిట్ ఇస్తే ఎసిబి ఎలా పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌కు సిండికేట్లపై సాక్ష్యాలు ఇచ్చామని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. సిఎంకు మద్యం కిక్ ఎక్కిందని విమర్శించారు. మద్యం సిండికేట్లపై ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని చెప్పారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu challenges TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X