వామపక్షాలను దువ్వుతున్న టిడిపి నేత చంద్రబాబు

స్టేషన్ ఘనపూర్, కోవూరు నియోజక వర్గాల్లో సిపిఎం అభ్యర్థులకు మద్దతిచ్చినా మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తెలంగాణకు చెందిన పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ చంద్రబాబు నివాసానికి వెళ్లడంపై కరీంనగర్‌లో జరిగిన పార్టీ మహాసభలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదని గట్టిగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు వాదించారు.
తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నందున తెలుగుదేశంతో స్నేహం చేయకూడదనే వాదన సిపిఐలో బలంగా ఉంది. దీంతో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సిపిఐ మద్దతివ్వడం అంత సులభం కాకపోవచ్చు. సిపిఎం మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అయితే, సిపిఎం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి తమ పార్టీ ఓట్లు పడకూడదనే ఉద్దేశంతోనే సిపిఎం కోవూరులో, స్టేషన్ ఘనపూరుల్లో సిపిఎం పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు.
స్టేషన్ ఘనపూర్‌లో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరి బలమైనవారే. అలాగే, కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారనే అనుకుంటున్నారు. ఈ స్థితిలో సిపిఎం ఈ రెండు స్థానాల్లో పోటీ చేయకపోతే తెలుగుదేశం అభ్యర్థులు మరింత బలపడుతారు. సిపిఎం పోటీ తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమే. దీంతో వామపక్షాలను దువ్వే పనిలో చంద్రబాబు పడ్డారని అంటున్నారు. వామపక్షాల నేతలతో చర్చలు జరపడానికి ఓ సమన్వయ కమిటీని కూడా వేశారు.












Click it and Unblock the Notifications