మద్యం మాఫియా ముసుగు వీరుడు కిరణ్ రెడ్డి: దాడి

ముఖ్యమంత్రి ఈ ఏడాది భారీగా అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చారని, అదనపు మద్యంపై గతం నుంచి ఉన్న పన్నును తగ్గించారని ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ నిందితుడని తెలిసినా సిఎం ఆయనను రక్షించారని మండిపడ్డారు. సిఎం తాను స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పుకుంటూ లిక్కర్ పర్సన్ గా మారారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు.
రాజీవ్ యువకిరణాల పథకంలో శిక్షణ పొందిన 616 మంది అభ్యర్థులు హెరిటేజ్‌లో ఉద్యోగాలు పొందారని సిఎం శాసనసభలో అబద్దాలు చెప్పారని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆ సంస్థలో గత ఆరు నెలలుగా 616 ఉద్యోగాలు భర్తీ కానప్పుడు యువకిరణాల ద్వారా ఏ రకంగా ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పచ్చి అవకాశవాది అని, ఆయనకు బాబును విమర్శించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications