ప్రభుత్వం కూలుతుందనే పారిపోతోంది: దేవినేని ఉమ

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారం చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టడం, పోడియం వద్దకు దూసుకు రావడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు టిడిపి ఆందోళనతో స్పీకర్ రెండుసార్లు సభను అరగంట పాటు వాయిదా వేశారు. మూడోసారి సమావేశమయ్యాక అదే సీన్ రిపీట్ కావడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోతుందని విమర్శించారు. మద్యం సిండికేట్లకు సంబంధించిన ఎసిబి నివేదికను వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కిరణ్ మద్యం అక్రమాలకు పాల్పడిన మంత్రులను కాపాడుతున్నారన్నారు. ఇరవై మంది మంత్రులు మద్యం అవినీతిలో కూరుకు పోయారన్నారు.

మోపిదేవి వెంకట రమణను తొలగిస్తే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, వెంకట రెడ్డిలను తొలగించాల్సి వస్తుందని తద్వారా ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయం కిరణ్ ను పట్టుకుందన్నారు. అందుకే వారికి సిఎం కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా మేం నిలదీస్తామని అన్నారు. స్పీకర్ వెంటనే అందరినీ సమావేశపరచాలన్నారు. మద్యం అవినీతితో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని తాము గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. అధికారులను అరెస్టు చేసేందుకు రమణ సాక్ష్యం పనికి వచ్చినప్పుడు మంత్రులపై చర్యలకు ఎందుకు పనికి రాదని ఆయన ప్రశ్నించారు. నున్నా రమణతో టిడిపికి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణం అంశం గవర్నర్, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తామని పల్లె రఘునాథ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+