వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం పదవిని చేపట్టే అర్హత నాకు ఉంది: జానా రెడ్డి

కోర్టుల్లో కేసులు ఉన్నందు వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని ఆయన అన్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణ సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. ఎన్నికలు జరుగుతుంటే తమ కాంగ్రెసు పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేయడం సరి కాదని ఆయన అన్నారు. ఏ పార్టీకైనా అన్ని సీట్లు గెలవాలని ఉంటుందని, అది ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందని, తాము ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామనే విషయాన్ని తాను పార్టీ అంతర్గత సమావేశంలో చెబుతానని ఆయన అన్నారు.