హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ఏకాభిప్రాయం లేకనే....: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయం లేకనే నిర్ణయం జరగలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణపై త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన సోమవారం చెప్పారు. సకల జనుల సమ్మె, తెలంగాణ సున్నితమైన అంశాలని, అందుకే వాటిని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. 2012 కేసులు ఎత్తేయాలని ఆదేశించామని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని, త్వరలో హోంశాఖతో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

జనాభా లెక్కలు వచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికల తేదీలు ఖరారవుతాయని ఆయన చెప్పారు. ఈసారి ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. శాసనసభలో చర్చ కన్నా రభసే ఎక్కువగా జరుగుతోందని, శాసనమండలిలో అర్థవంతమైన చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రతిపక్షాలు బయటపెట్టాలని ఆయన సూచించారు.

English summary
CM Kiran kumar Reddy said that Center will take decision on Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X