హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోవూరులో తెరాస అభ్యర్థి పోటీ ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కోవూరు శానససభా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీ దించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. తాను కోవూరు ప్రచారానికి కూడా వెళ్తానని ఆయన చెబుతున్నారు. తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో తమ వాదనను వినిపించడానికి దీన్ని అవకాశంగా ఆయన వాడుకోవాలని చూస్తున్నట్లు అనుకోవచ్చు. సాధారణంగా అభ్యర్థిని పోటీకి దించి మిన్నకుండవచ్చు గానీ తాను ప్రచారానికి వెళ్తానని చెప్పడం ద్వారా మరో ఆసక్తికరమైన రాజకీయానికి ఆయన తెర తీయాలని అనుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెప్పవచ్చు.

అయితే, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడిరపై ధ్వజమెత్తడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలోని బాలాయిపల్లిలో చంద్రబాబుకు బినామీ ఆస్తులున్నాయంటూ ఆరోపించారు. ఆ బాలాయిపల్లి కోవూరు నియోజకవర్గంలోనే ఉంది. దీంతో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా కోవూరు ప్రజల మనసు మార్చడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది చూడాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు.

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్తా బలంగానే ఉంటుంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఓట్లు చీలితే తెలుగుదేశం పార్టీ లాభపడవచ్చు. అలా జరగకుండా చూసే ఎత్తుగడ కూడా కెసిఆర్ అభ్యర్థిని దించాలనే విషయం ఇమిడి ఉన్నట్లు చెబుతున్నారు. దానికితోడు, తనపై సమైక్య నినాదం వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా చర్యకు దిగితే దాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా వాడడానికి వీలవుతుందని కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
It is became an interesting point of fielding TRS candidate in kovvur seat by KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X