ఫ్యాన్ గుర్తును కోరతాం: జగన్ పార్టీ నేత కొణతాల

Konathala Ramakrishna
నెల్లూరు: త్వరలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కేటాయించమని ఎన్నికల కమిషన్‌ను కోరతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆదివారం చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డికిమార్చి 3వ తేదిన పార్టీ గుర్తు వచ్చే అవకాశముందని చెప్పారు. గుర్తు అధికారికంగా వెలువడిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కొవ్వూరు ఉప ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోటీ అన్నారు. పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికలో గెలవాలని జగన్ వర్గం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో సవాల్ విసిరారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవ్వూరు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు పార్టీ గెలిచి చూపించాలన్నారు. కొవ్వూరుతో పాటు తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+