హైదరాబాద్: రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడిన ఓ టెక్కీ కనిపించకుండా పోయాడు. మొదటి పెళ్లి విషయాన్ని దాచి పెట్టి ఆదివారంనాడు రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన టి. ఉమేష్ రావు అలియాస్ ఉమేష్ కనిపించకుండా పోయాడు. హైదరాబాదులోని సరూర్‌నగర్‌లోని అలకాపురికి చెందిన ఉమేష్ మాదన్నపేటకు చెందిన ఓ అమ్మాయిని ఆదివారం పెళ్లి చేసుకోవాల్సి ఉండింది. అయితే, మొదటి పెళ్లి విషయం రెండో పెళ్లికి సిద్ధపడిన అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మాదన్నపేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఉమేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
కాగా, ఉమేష్ తల్లిదండ్రులు సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషనులో మిస్సయ్యాడంటూ ఫిర్యాదు చేశారు. తన పొరుగున ఉండే అమ్మాయితో ఉమేష్ ప్రేమలో పడి 2008 అక్టోబర్ 23వ తేదీన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తమ పెళ్లి విషయాన్ని వారిద్దరు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. రహస్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఉమేష్ ఎంఎస్ చేయడానికి ఐర్లాండ్ వెళ్లాడు.
పోలీసుల కథనం ప్రకారం - ఉమేష్ 2011 మేలో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. మాదన్నపేటలోని తమ బంధువుల అమ్మాయితో ఉమేష్ తల్లిదండ్రులు అతని పెళ్లిని నిశ్చయం చేశారు. మొదటి భార్య తల్లిదండ్రులు ఉమేష్ తల్లిదండ్రులను కలిశారు. అప్పుడే అక్కడి నుంచి ఉమేష్ మాయమయ్యాడు.
A 32-year-old software engineer is absconding after landing in trouble on Sunday for trying to marry for a second time by hiding the fact of his first marriage.
Story first published: Monday, February 27, 2012, 11:39 [IST]