న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. గత సంవత్సరం ఆమె విదేశాల్లో ట్రీట్‌మెంట్ చేయించుకున్న విషయం తెలిసిందే. ట్రీట్‌మెంట్‌లో భాగంగా చెకప్ కోసం ఆమె వెళ్లారు. సోనియా వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లారని, మరో నాలుగైదు రోజుల్లో ఆమె భారత దేశానికి తిరిగి వస్తారని కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ 2011లో అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
గర్భాశయ మఖద్వార క్యాన్సర్‌తో బాధపడిన సోనియా గాంధీ గత సంవత్సరం ఆగస్టు రెండవ తేదిన అమెరికా వెళ్లారు. అక్కడ ఆమె చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలోనే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. నెల రోజులకు పైగా అక్కడే ఉన్న సోనియా సెప్టెంబర్ 8న భారత్ చేరుకున్నారు. సోనియా గాంధీ ఆగస్టు రెండవ తేదిన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక నాలుగైదు రోజులకే అప్పుడు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో వచ్చారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి