హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీసం మెలేసినా చర్యలేవి?, అసెంబ్లీ కంటే బెటర్: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మీసాలు తిప్పి విప్ ధిక్కరించినా ఎలాంటి చర్యలు లేవని ఆయన సొంతపార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తటస్థ అభ్యర్థి పోటీ చేసి గెలిచే అవకాశముందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర పార్టీలో తటస్థ అభ్యర్థిని బలపరుస్తాయన్నారు. కాంగ్రెసులో కూడా కొందరు తటస్థ అభ్యర్థికి ఓట్లు వేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు తటస్థ అభ్యర్థికి ఓట్లు వేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేదన్నారు. పార్టీలో పౌరుషం తగ్గిందన్నారు. అసెంబ్లీని చూస్తుంటే భరించలేక పోతున్నానన్నారు. అసెంబ్లీ కంటే రాజ్యసభ బాగుందన్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన మాత్రం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగితే ఏం చేస్తారో చూడాలన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభకు తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుండి పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి ఉందని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమాత్రం చర్చకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వర్గ ఎమ్మెల్యేల వేటు విషయం స్పీకర్ చూసుకుంటారని అన్నారు. ప్రజలను దానం కోసం ఎదురు చూసేలా మార్చారని ఆయన విమర్శించారు.

English summary
Senior MLA JC Diwakar Reddy unhappy with party attitude. He said that independent candidate may win in Rajyasabha election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X