హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎఫ్ఐఆర్‌లో గాలి భార్య పేరును చేర్చిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Aruna
హైదరాబాద్: అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్‌లో సిబిఐ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పేరునే కాకుండా ఆయన భార్య అరుణ లక్ష్మి పేరును కూడా చేర్చింది. కర్ణాటక గనుల శాఖ మాజీ మంత్రి మునియప్ప పేరును కూడా సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఎఎంసి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ.

జిందాల్ స్టీల్ వర్క్స్ వంటి కంపెనీలు ఎఎంసి నుంచి అనుమతి లేకుండా ముడి ఇనుమును కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వివిధ కంపెనీలకు సరఫరా చేసిన ముడి ఇనుము పరిమాణం అక్కడ తవ్వకాలు జరిపిన పరిమాణం కన్నా ఎక్కువ ఉంది. పరిమితికి మించి తవ్విన ముడి ఇనుమును అనంతపురం మీదుగా విశాఖపట్నం ఓడరేవుకు తరలించిన విషయంపై కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

గాలి సోదరులు సింగపూర్‌లో మ్యాన్ -గో పబ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసి గాలి లక్ష్మి అరుణ ఇంటర్నేషనల్‌గా పేరు పెట్టారు. మ్యాన్ - గో పబ్ ప్రైవేట్ లిమిటెడ్ 2004 అక్టోబర్ 28వ తేదీన రిజిష్టర్ అయింది. సింగపూర్‌కు చెందిన అరంగన్నల్‌ను దాని డైరెక్టర్‌గా నియమించి 2007లో జిఎల్ఎగా పేరు మార్చారు. కంపెనీ లక్ష్యాన్ని 2007 డిసెంబర్‌లో మారుస్తూ గాలి జనార్దన్ రెడ్డి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జిజెఆర్ హోల్డింగ్స్, ఇంటర్ లింక్ సర్వీసెస్, జిఎల్ఎ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవహారాలపై కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

English summary
The CBI in its FIR on the Associated Mining Company (AMC) scam has named not only former Karnataka minister Gali Janardhan Reddy but also his wife Laxmi Aruna and former Karnataka mines minister Muniyappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X