వైయస్, కెవిపిలతో పేకాట ఆడా: గాలి ముద్దుకృష్ణమ

"నేను రాజకీయాల్లోకి రాక ముందు గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రభుత్వ లెక్చరర్‌గా చేశాను. అక్కడ వేరే వ్యాపకం లేక కొందరు అధికారులతో కలిసి రిక్రియేషన్ క్లబ్బుగా ఏర్పడ్డాం. సరదాగా కాసేపు పేకాట ఆడుకొనేవాళ్ళం. అందులో డబ్బుల వంటి వ్యవహారాలేవీ ఉండేవి కావు. నా జీవితంలో ఎన్నడూ పేకాట ఆడి ఆరెస్టు కాలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్, కేవీపీతో కూడా పేకాట ఆడాను.'' అని అన్నారు. "కన్నా కారంపూడిలో ఒక మిల్లులో రోజుకు డెబ్భై రూపాయల కూలికి పని చేశారు. నూజివీడులో అత్తగారింటి వద్ద పశువులు కూడా కాశారు'' అని వివరించారు.
వెంటిలెటర్‌పై ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాపాడుతున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలను ధరించి సభకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే డిస్‌క్వాలిఫై చేయాలనీ అంటున్నా ఇప్పటికీ వారిపై చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.












Click it and Unblock the Notifications