సీమాంధ్రకు బాబు పెదబాబు జగన్ చినబాబు: శంకరరావు

Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర రావు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పెదబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చినబాబుతో పోల్చారు. సీమాంధ్ర ప్రాంతానికి వారిద్దరు పెదబాబు, చినబాబులు అన్నారు. అక్కడ పోటీ వారిద్దరి ప్రధానంగా వారిద్దరి మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఆధిక్యం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అక్కడి పోరులో కాంగ్రెసు పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు.

సీమాంధ్రలో దళితులు, క్రైస్తవులు జగన్ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. జగన్‌కు అదే ప్రధాన ఓటు బ్యాంక్ అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం అన్ని పార్టీలు రంగంలో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఇక్కడి ప్రజలకు పీకల వరకు కోపం ఉందని శంకర రావు అన్నారు. కాగా శాసనసభ లాబీల్లో శంకర రావు, చంద్రబాబు పరస్పరం తారాసపడినప్పుడు వారిద్దరు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడుతూ.. తాను బాబును ఎందుకు అభినందించానో తనకు తెలుసునని, బాబు నన్ను ఎందుకు అభినందించారో ఆయనకు తెలుసునని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+