రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురు కిడ్నాప్, వీడిన మిస్టరీ

కొంత సేపటికి అనూష తండ్రి కిష్టయ్యకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడు. నీవు అనూష తండ్రివేనా అని హిందీలో ప్రశ్నించాడు. హిందీ సరిగా రాని కిష్టయ్య ఫోన్ పక్కనే ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. దీంతో అగంతకుడు ఫోన్ కట్ చేసి స్విచాఫ్ చేశాడు. వెంటనే కిష్టయ్య పాఠశాలకు వెళ్లి చూశాడు. అక్కడ అనూష లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అనూషను తెల్లరంగు క్వాలిస్ వాహనంలో బెంగళూరు వైపునకు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. దుండగులు డబ్బు కోసమే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారా? లేదా మరేదైనా కారణం ఉందా అన్నది తెలియరాలేదు. కాగా అనూష కిడ్నాప్ మిస్టరీ గురువారం వీడింది. మెదక్ జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి అనూషను రక్షించారు.












Click it and Unblock the Notifications