హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపాధి హామీపై టిడిపి సభ్యుల రగడ: అసెంబ్లీ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం అమలుపై శుక్రవారం శాసనసభలో రగడ చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సభ్యులు శానససభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సభా సంఘానికి నిరాకరించడంతో వారు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు.

అంతకు ముందు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ - ఉపాధి హామి పథకం అమలు కోసం గ్రామ సభలు జరగడం లేదని, గ్రామసభలు జరిగినట్లు రుజువు చేస్తా తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను పాటిస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సామాజిక తనిఖీ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు.

మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

English summary
Assembly adjourned for 15 minutes, as TDP members stalled the procedings on employment gaurantee scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X