హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నిర్మాత హత్యకు సూరి అనుచరుడి ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
హైదరాబాద్: ఓ సినీ నిర్మాత హత్యకు మద్దెలచెర్వు సూరి అనుచరుడు పథకం రచించినట్లు హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. అయితే, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఓ భూవివాదంలో సూరి అనుచరుడు రాజశేఖర రెడ్డి సినీ నిర్మాతను హత్య చేయడానికి పథకం రచించాడని, కేసు దర్యాప్తులో ఉన్నందున వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు. విజయవాడలో ఓ సిఎ హత్య కేసులో సూరి అనుచరుడితో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ ఖాన్ ఆ సినీ నిర్మాత హత్యకు కుట్ర చేసిన విషయాన్ని వెల్లడించారు.

ఫిబ్రవరి 22వ తేదీన 65 ఏళ్ల వేమరాజు చక్రపాణి అనే సిఎ గొంతును శస్త్రచికిత్స చేసే కత్తితో కోసి, అతని మృతదేహాన్ని దహనం చేశారు. ఈ కేసులో టి. రాజశేఖర రెడ్డి, కె. శ్రీనివాస గౌడ్, వై సిద్దిరాములు, డి. రాజేష్ గౌడ్, పోలీసు పటేల్ మహేష్, కె. శివకుమార్‌లను అరెస్టు చేసినట్లు ఖాన్ తెలిపారు. ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం - శంభుప్రసాద్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాగేశ్వర్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చక్రపాణి 4,800 చదరపు గజాల భూమి కొన్నాడు. అయితే శంభుప్రసాద్‌కు, చక్రపాణికి మధ్య వివాదం తలెత్తింది. జూబ్లీహిల్స్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన రాజశేఖర రెడ్డికి మరో వ్యక్తి ఆ భూమిని విక్రయించాడు.

మూడు కోట్లు తీసుకుని భూమిని వదిలేయాలని రాజశేఖర రెడ్డి చక్రపాణికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, చక్రపాణి 17 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో చక్రపాణి హత్యకు రాజశేఖర రెడ్డి పథకం వేశాడు. ఈ సమయంలోనే రాజశేఖర రెడ్డి సంబంధాల్లోకి రికవరీ ఏజెంట్ శ్రీనివాస గౌడ్ వచ్చాడు. చక్రపాణి హత్యను రాజశేఖర రెడ్డి శ్రీనివాస గౌడ్‌కు అప్పగించాడు. శ్రీనివాస గౌడ్ తన నలుగురు అనుచరులతో కలిసి చక్రపాణిని హత్య చేశాడు.

English summary
Police said that the culprits have also confessed that they had planed to kill a film producer in connection with another land dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X