హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, చంద్రబాబులపై దుమ్మెత్తిపోసిన బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దుమ్మెత్తిపోశారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జగన్‌పై ఓ సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, ఈ స్థితిలో జగన్ నీతి గురించి మాట్లాడుతున్నారని, ఇది మన ఖర్మ అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. మద్యాన్ని నియంత్రిస్తామని జగన్ అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జగన్, చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ సెంటిమెంటు లేదని తమ పార్టీ అనలేదని, కొన్ని పార్టీలు యూ - టర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణపై సందిగ్గత ఏర్పడిందని, త్వరలో తెలంగాణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు వల్లనే తాము రెండోసారి అధికారంలోకి వచ్చామని, టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పథకం దుర్వినియోగమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని చంద్రబాబే స్వయంగా అంగీకరించారని ఆయన అన్నారు. చంద్రబాబుకు పేద ప్రజలంటే పట్టదని ఆయన అన్నారు.

తాము అధికార ప్రతినిధులను నియమిస్తామని, వారు మాట్లాడేదే పార్టీ విధానమని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను వారు తిప్పికొడతారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల కోసం గాంధీభవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు లేదా నాలుగో స్థానమే దక్కుతుందని ఆయన అన్నారు. తన 27 ఏళ్ల రాజకీయానుభవంతో తాను ఈ విషయం చెబుతున్నానని ఆయన అన్నారు. చిరంజీవి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రేపు శనివారం ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. గంటకో మాట పూటకో మాట కాంగ్రెసు విధానం కాదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై త్వరలో అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధఫడుతున్నట్లు ఆయన తెలిపారు. శానససభలో తమ సభ్యుల తీరు, హాజరు సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana lashed out at TDP president N Chandrababu Naidu and YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X