హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కొడుకొస్తే తప్పేంటి?:చిరు స్థానంపై గల్లా అరుణ కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
హైదరాబాద్: రాజకీయాల్లోకి తన కుమారుడు వస్తే తప్పేంటని మంత్రి గల్లా అరుణ కుమారి గురువారం అన్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన పక్షంలో అక్కడ ఉప ఎన్నికలు జరిగితే తన కుమారుడు కాంగ్రెసు తరఫున ఎందుకు పోటీ చేయకూడదని మంత్రి గల్లా అరుణ కుమారి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో... విలేకరులు అరుణ కుమారిని చిరంజీవి ఎంపీగా వెళ్లిన పక్షంలో మీ కుమారుడు ఆ స్థానం నుండి పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. అందుకు ఆమె పోటీ చేస్తే తప్పేమిటన్నారు. వైద్యుల కుమారులు వైద్యులు, యాక్టర్ల కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదన్నారు. అర్హత ఉన్న వాళ్లు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చునన్నారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ వర్గం నాగ బాబు పేరు ప్రస్తావించడం గమనార్హం.

కాగా హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా గురువారం పార్లమెంటు అభ్యర్థిత్వంపై స్పందించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని వచ్చిన వ్యాఖ్యలను ఆమె కొట్టి పారేశారు. ఆ స్థానం నుండి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఉండగా తాను పోటీ చేస్తానని ఎలా చెబుతానని ఆమె అన్నారు.

English summary
Minister Galla Aruna Kumari seeing at MLA Chiranjeevi constituency Tirupati for her son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X