హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను అసలు లిక్కర్ సిండికేట్‌నే కాదు: నున్న రమణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nunna Ramana
హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణకు రూ.పదిలక్షలు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నున్న రమణ శుక్రవారం మీడియా ఎదుట పెదవి విప్పారు. ఆయనను కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా అతనిని పలకరించింది. తాను అసలు లిక్కర్ సిండికేట్ నే కాదని అలాంటప్పుడు మంత్రి మోపిదేవికి పది లక్షల రూపాయలు ఎలా ఇస్తానని అన్నారు. నాకు ఎలాంటి మద్యం దుకాణాలు లేవని, తనను అనవసరంగా ఈ వివాదంలో ఇరికించారని అన్నారు. నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. పంపకాల గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చానని, వ్యవసాయమే చేసి బతుకుతున్నానని చెప్పారు. తన అరెస్టు కారణంగా తన పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో అందరు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారన్నారు. కాగా తనపై ఒత్తిడి తీసుకు వచ్చి డబ్బులు ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇప్పించారని రమణ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా రమణనను ఎసిబి ఆధికారులు ఉదయం కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతనికి పద్నాలుగు రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

English summary

 Nunna Ramana said that he is not liquor syndicate. He condemned allegations, Rs.10 lakhs to minister Mopidevi Venkata Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X