హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క శాతం వ్యాట్ తగ్గిస్తే 1200 కోట్లు నష్టం: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: వస్త్రాలపై వ్యాట్‌ను తగ్గించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో వస్త్రాలపై వ్యాట్‌ను తగ్గించాలని కొంత మంది శానససభ్యులు ముఖ్యమంత్రిని కోరారు. అయితే ముఖ్యమంత్రి అందుకు నిరాకరించారు. ఒక్క శాతం వ్యాట్‌ను తగ్గిస్తే 1200 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు.

కొత్త సంక్షేమ పథకాలను సూచించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. శాసనసభకు శాసనసభ్యులు విధిగా హాజరు కావాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి శాసనసభ్యులు కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు త్వరలో పార్టీకి, సిఎల్పీకి అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని వేయనున్నట్లు ఆయన చెప్పారు.

పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. శాసనసభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పార్టీ తరఫున, సిఎల్పీ తరఫున 20యేసి మందితో కమిటీలను వేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
CM Kiran Kumar Reddy reduced VAT, when few MLA appealed in CLP executive meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X