హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్తిబాబును వైయస్ తప్పించారు: దూళిపాళ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dulipalla Narendra
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై అసలు సిబిఐ విచారణే జరగలేదని అలాంటప్పుడు సిబిఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఎలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాళ్ల నరేంద్ర గురువారం ప్రశ్నించారు. వోక్స్ వ్యాగన్ పై సిబిఐ విచారణ వేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ విచారణ పరిధి నుంచి బొత్సను తప్పించారని ఆరోపించారు. వోక్స్ వ్యాగన్ కేసులో సిబిఐ నివేదికను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ కుంభకోణంలో బొత్స ప్రమేయం స్పష్టమవుతుందన్నారు. బొత్స బంధువు మురళీ కృష్ణ రూ.రెండు కోట్లు డిమాండ్ చేశారని అలగ్ రాజా ఇచ్చిన వాంగ్మూలంలో ఉందన్నారు. నాడు వైయస్ బొత్సను కాపాడకుండా ఉంటే ఇప్పుడు ఆయనకు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి పట్టిన గతే పట్టి ఉండేదన్నారు. బొత్స వాస్తవాలు కప్పి పుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా వైఎస్ హయాంలో అవసరం లేని వారికి కూడా భూములిచ్చారని, అలాంటి వాటిని వెనక్కు తీసుకోవాలని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన భూపందేరంలో రూ. రెండు వేల కోట్ల విలువైన భూములు ధారాదత్తం అయ్యాయని ఆరోపించారు. సిబిఐ నివేదిక బయటపెడితే మంత్రులందరూ జైళ్లో ఉంటారన్నారు. భూ పందేరంపై హౌస్ కమిటీ వేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు.

English summary
TDP leader Dulipall Narendra blamed that late YS Rajasekhar Reddy protected PCC chief Botsa Satyanarayana in Volkswagen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X