బెంగళూరు: సిటీ సివిల్ కోర్టులో శుక్రవారం ఉద్రిక్తత ఏమాత్రం తగ్గలేదు. మీడియా ప్రతినిధులు, న్యాయవాదుల మధ్య ఘర్షణకు ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదులు బిల్డింగ్ నాలుగో అంతస్తుపై నుండి కుర్చీలు విసరడంతో పలువురు పోలీసులు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. మహదేవయ్య అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయవాదులు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులు, డిసిపికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు పద్దెనిమిది మంది మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి కోమాలోకి వెళ్లాడు. ఓబి వ్యాన్లను ధ్వంసం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా బెంగళూరు ఘటనపై ముఖ్యమంత్రి సదానంద గౌడ పోలీసు ఉన్నతాధికారులు, మంత్రివర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై గూండా యాక్టు కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా మీడియా, న్యాయవాదుల ఘర్షణతో బెంగళూరులో భయానక వాతావరణం నెలకొంది.
Police constable Mahadevappa, who was grievously injured when furniture thrown on police, died at Bowring hospital in Bangalore on Friday. Rampaging advocates had thrown heavy furniture on police from the 5th floor of City Civil and Sessions Court complex.
Story first published: Friday, March 2, 2012, 16:43 [IST]