గాలి ఎఫెక్ట్: రెచ్చిపోయిన లాయర్లు, మీడియాపై రాళ్లు
National
oi-Srinivas
By Srinivas
|
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని శుక్రవారం బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండుసార్లు న్యాయవాదులు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఆయనను కోర్టులో హాజరు పరిచే సమయంలో మీడియా ప్రతినిధులు కవరేజ్ చేసేందుకు వెళ్లారు. అయితే వారిని న్యాయవాదులు అడ్డుకున్నారు. న్యాయవాదులు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. కెమెరాలు తదితర వస్తువులు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఆ తర్వాత మరోసారి మీడియాపై న్యాయవాదులు దాడి చేశారు. పలు ఛానళ్ల ఓబి వ్యాన్లను ధ్వంసం చేశారు. జర్నలిస్టులు, మీడియాపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన సిటీ సివిల్ కోర్టు వద్ద చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రాంతం రణరంగంగా మారింది. రెండోసారి ఘటనలో పదిమంది జర్నలిస్టులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదులు రెచ్చిపోయి తమపై దాడి చేయడాన్ని మీడియా ప్రతినిధులు తప్పుపడుతున్నారు.
A clash between lawyers and media persons took place after Mining don Gali Janardhan Reddy was produced in Bangalore court on Friday in connection with the AMC mining case.
Story first published: Friday, March 2, 2012, 12:32 [IST]