వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖపై పోటీ చేస్తాం: తెరాస నేత వినోద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vinod
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల శాసనసభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖపై తాము పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ చెప్పారు. తెలంగాణ కోసం సురేఖ చేసిన రాజీనామాను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించలేదని, కాంగ్రెసు పార్టీ విప్‌ను ధిక్కరించిందనుకు సురేఖపై వేటు వేశారని, అందువల్ల తాము పరకాలలో ఆమెపై పోటీ చేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ పార్లమెంటులో ప్రకటన చేస్తే తాము కొండా సురేఖకు మద్దతిస్తామని ఆయన చెప్పారు. కొండా సురేఖపై అభ్యర్థిని పెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తే తెలుగదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న ఆ ఇద్దరు నాయకులపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. చిరంజీవి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తే అభ్యర్థుల ఉనికి కూడా ఉండదని ఆయన అన్నారు.

English summary
TRS former MP Vinod said that his party will contest against YSR Congress leader Konda Surekha at Parakala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X