లవ్ అఫైర్‌లో విద్యార్థి హత్య, కాల్చేసిన అమ్మాయి అన్న

గురువారం రాత్రి కొండ ప్రాంతం నుంచి పొగ వస్తుండడంతో గ్రామస్తులు అనుమానించారు. అక్కడికి వెళ్లి చూడగా సాగర్ దేహం అప్పటికే సగం కాలి పోయి ఉంది. సాగర్‌ను కృష్ణతో పాటు అతని మిత్రులు జనార్దన్, కిషన్, మరో గుర్తు తెలియని యువకుడు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సాగర్ కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందినవాడు.
జనార్దన్ ఇంటికి తరుచుగా వచ్చే కృష్ణ సోదరితో సాగర్‌కు పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలిసి తిరుగుతుండేవారు. కృష్ణ ఎంతగా హెచ్చరించిన సాగర్ వినలేదు. సాగర్‌ను ఫిబ్రవరి 27వ తేదీన జనార్దన్ సహాయంతో కృష్ణ కిడ్పాప్ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సాగర్ తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు సాగర్‌ను కొండ ప్రాంతానికి తీసుకుని కృష్ణ, అతని మిత్రులు హత్య చేశారని చెబుతున్నారు.