హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనం దిశలో చిరు పార్టీ: రాజీనామా పూర్తి, ఇక పదవే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభా పక్షంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్షం విలీనం కావడం ఇక లాంఛన ప్రాయమేనని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకైశం కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లడంతో ఆమెపై ఆ పార్టీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. అవిశ్వాసం సందర్భంగా ప్రరాపా విప్ ని ఆమె ధిక్కరించారు. దీనిపై విచారణ సాగుతుండగానే శోభా నాగి రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. ఇంతకాలం విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడానికి ఆమెపై జరుపుతున్న విచారణ ఒకటి కారణం కాగా, చిరంజీవికి రాజ్యసభ స్థానం మరొకటి అనే వాదనలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఆమె రాజీనామా ఆమోదం జరిగి పోయింది. మరికొద్ది రోజుల్లో చిరంజీవిని రాజ్యసభకు పంపనున్నారని తెలుస్తోంది. దీంతో ఇక విలీన ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

ఇప్పటికే విలీనంపై ప్రజారాజ్యం శాసనసభ పక్షం నుంచి స్పీకర్ కు లేఖ అందింది. ఇటీవలె సిఎల్పీ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే తీర్మానం ప్రతిని స్పీకర్ కు పంపలేదు. విలీనానికి అడ్డుగా ఉన్న రెండు ప్రక్రియల్లో శోభా నాగి రెడ్డి రాజీనామా ప్రక్రియ పూర్తి కావడం, చిరుకు రాజ్యసభ మరికొద్ది రోజుల్లో ఇవ్వనున్న నేపథ్యంలో త్వరలోనే తీర్మానాన్ని పంపుతారని, ఆ తర్వాత ఒక సమావేశం నిర్వహించి విలీనాన్ని ఆమోదిస్తారని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం. శాసనమండలిలోనూ ఇదే విధంగా విలీన ప్రక్రియ చేపడతారు. అయితే చిరంజీవి శాసనసభలో వెనుక సీట్లో కూర్చునేందుకు ఇష్ట పడటం లేదనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆయనకు రాజ్యసభ వచ్చే వరకు సభలో విలీన ప్రక్రియ ఉండదన్న ఆరోపణలను పిఆర్పీ వర్గాలు అప్పుడే కొట్టి పారేశాయి.

English summary
It seems, PRPLP may merged in CLP soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X