ప్రచారానికి చిరు రెడీ: తెలంగాణ నేతల వ్యతిరేకత

చిరంజీవి ప్రచారంపై తెలంగాణకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి మంగళవారం చేసిన ప్రకటన తెలంగాణ నాయకుల్లోని వ్యతిరేకతను సూచిస్తోంది. చిరంజీవి అవసరం ఎవరికి ఉందో వారే ఆయనను ఆహ్వానించాలని జానా రెడ్డి ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి కూడా చిరంజీవి ప్రచారంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రచారానికి చిరంజీవి రావద్దని ఆయన బహిరంగంగానే చెప్పారు.
కాగా, విభజనపై జిమ్మిక్కులు చేస్తే పరాభవం తప్పదని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని జానా రెడ్డి అన్నారు. తెలంగాణను యుపి విభజనతో పోల్చడం సరి కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications