చిరును చూపి కాపులను బలి చేస్తున్నారు: ఆదికేశవులు

చిరంజీవిని ముందుపెట్టుకుని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆదికేశవులు నాయుడు ధ్వజమెత్తారు. " చిరంజీవిని రాజ్యసభకు పంపితే సరిపోతుందా అని ఆయన అడిగారు. చిరంజీవిని ముందు పెట్టుకుని రాయలసీమలోని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని ఆయన అన్నారు. చిరంజీవికి ఏదో చేస్తున్నట్టు మా సామాజికవర్గం మొత్తాన్ని నడివీధిలో వదిలేశారని ఆయన అన్నారు. మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌ను మూలన కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications