భార్యను హత్య చేసి పారిపోయిన హైదరాబాద్ టెక్కీ

నిందితుడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన మామకు ఫోన్ చేసి షామిలి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పాడు. అయితే అంతకుముందు మధ్యాహ్నం షామిలి తన తల్లికి ఫోన్ చేసి భోజనం గురించి మాట్లాడింది. అంతకుముందు రోజు ఫోన్ చేసి, తాను బాగా లేనని, తన భర్త తనని పని చేయమని వేధిస్తున్నారని తల్లికి చెప్పారు. నీవు నాకు సరితూగవని, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎక్కువ వరకట్నం వస్తుందని, నువ్వు అదనపు కట్నం తీసుకు రావాలని తనను తన భర్త అడుగుతున్నాడని ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications