వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్: ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఉర్దూ కీబోర్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రతిష్ట మొత్తం ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్‌కు దక్కుతోంది. దేశానికి తిరుగులేని నాయకుడవుతారని భావించిన రాహుల్ గాంధీతో ఆయనను పోలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక రకంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేతగా ఉన్న తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను దాటేసి ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరంగాలను ఎస్పీ హవాగా మార్చేశారు. రాజకీయాలకు రావడానికి ముందు అఖిలేష్ యాదవ్ మైసూర్ జయచామరాజేంద్ర కళాశాల నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చుకున్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. అయితే, ఆయన తన పరిశోధనను ఇప్పటి వరకు సమర్పించలేదని అంటారు. ఆయన ధోల్పూర్ మిలిటరీ స్కూల్లో చదివారు.

అఖిలేష్ యాదవ్ 1973 జులై 1వ తేదీన ఇట్టావా జిల్లాలోని సైఫాయిలో జన్మించారు. మొదటిసారి ఉప ఎన్నికల్లో 2000లో కన్నౌజ్ స్థానం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009ల్లో కూడా లోకసభకు ఎన్నికయ్యారు. కానీ 2009లో రాష్టర్ పార్టీకి నాయకత్వం వహించిన తర్వాత ఆయన రాజకీయ నైపుణ్యాలు బయటపడ్డాయి. 2009లో ఫిరోజాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కన్నౌజు నుంచి కూడా విజయం సాధించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే, సీటును వదిలేసినందుకు అఖిలేష్‌పై ఆగ్రహించిన వోటర్లు ఆయన భార్యను ఉప ఎన్నికల్లో ఓడించారు. రాజ్ బబ్బర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే స్వప్నాలను, ఆకాంక్షలను ఆయన అర్థం చేసుకున్నారు.

నిరంతరం పని చేసే అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలోని స్థానిక నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. 2012 ఎన్నికల సందర్భంగా ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మాయావతి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోస్తూ ప్రతికూల ప్రచారానికి పూనుకోగా, అఖిలేష్ యాదవ్ ఉచిత ల్యాప్‌టాప్‌ల వాగ్గానం వంటి సానుకూల ప్రచారం ద్వారా విజయం సాధించారు.

కాంగ్రెసు పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తే, అఖిలేష్ యాదవ్ ఉర్దూ కీబోర్డుల గురించి మాట్లాడారు. డిపి యాదవ్ వంటి నేరచరిత్ర గల నాయకులను క్రమంగా దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్‌కు అసలు పరీక్ష ఎదురు కానుంది. పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందించబోయే పాలన, విధాన నిర్ణయాలు, పథకాల అమలు వంటివి అఖిలేష్ యాదవ్ రాజకీయాలను నడిపిస్తాయని చెప్పవచ్చు.

English summary
While the Congress talked about reservation for Muslims, Akhilesh talked about Urdu keyboards. Combined with this has been a steely resolve to deny tickets to candidates like DP Yadav whose 'criminal' image would have harmed the party, according to Akhilesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X