సిఎం రేసులో లేను: అఖిలేష్, మాయావతి రాజీనామా!

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని పిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణ అన్నారు. యుపి ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. అయితే ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. రాహుల్ ఒక్కరే ఫలితాలకు బాధ్యులు కారని మరో నేత అయ్యర్ అన్నారు. ఆయన చరిష్మాతోనే ఆ కొద్ది సీట్లు గెలిచామన్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్ తో భేటీ కానున్నారు. యుపిలో 46 జిల్లాలో కాంగ్రెసు అడ్రస్ లేకుండా పోయింది. ఎస్పీ తొమ్మిది జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది.












Click it and Unblock the Notifications