ఆజంపై ఓడిన జయప్రద, ఆంధ్రకు తిరుగు టపా?

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గాను అమర్ సింగ్‌తో పాటు జయప్రద సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అమర్ సింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. గత లోకసభ ఎన్నికల్లోనే ఆజం ఖాన్ జయప్రదకు చుక్కలు చూపించారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆజంఖాన్ మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జయప్రద ఆజంఖాన్ దాటికి తట్టుకోవడం కష్టమే అవుతుంది. దీంతో ఆమె రాంపూర్‌ను ఖాళీ చేయక తప్పదని అంటున్నారు.
జయప్రద గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమెకు అవకాశం ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి జయప్రద పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరని చెబుతున్నారు. జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీలో చేరుతారో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications