ఎస్పీ జోష్, పని చేయని రాహుల్ గాంధీ చరిష్మా

Rahul Gandhi and Mulayam Singh Yadav
లక్నో: ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల్లో ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది. సంపూర్ణ మెజారిటికీ సింగిల్ డిజిట్ స్థానాలు మాత్రమే తక్కువ పడే అవకాశం ఉంది. దీంతో ఎస్పీ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ 194 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీ స్థానాలు సగానికి సగం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. బిఎస్పీ 101 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెసు, ఆర్ఎల్డీ కూటమి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒకప్పుడు ఊపేసిన బిజెపి నాలుగో స్థానానికి మాత్రమే పరిమితమైంది.

రాహుల్ గాంధీ చరిష్మా అనుకున్నంత పని చేయలేదని, తాము ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వంటి నాయకులే అంగీకరిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ యుపి యువతను ఆకట్టున్న సూచనలు కనిపిస్తున్నాయి. నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉన్న అమేథీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగులుతోంది. ఫలితాలు వెలువడిన ప్రారంభంలో బిజెపి కాస్తా జోరుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత అది పూర్తిగా వెనకబడిపోయింది.

రాహుల్ గాంధీ మూడు నెలల పాటు ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికలపై దృష్టి పెట్టి విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+