రాహుల్, చంద్రబాబులపై జగన్ పార్టీ నేత గట్టు ఫైర్

చంద్రబాబు తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ ప్రభంజనం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సైకిల్ గెలుస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు ములాయంతో చంద్రబాబు పోల్చుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు.
అవినీతిపరుడు, గజదొంగ లాంటి చంద్రబాబును 2004 ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. చంద్రబాబు కాలం తీరిన సరుకు అని ఆయన అన్నారు. అలిపిరి ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబును ఏలాంటి దయ చూపకుండా ప్రజలు దారుణంగా ఓడించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఆటలు సాగవని, ఇరు పార్టీలు కుమ్మక్కయిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications