వైయస్ కూతురిపైనా విషమంటూ రామోజీపై సాక్షి ఫైర్

ఒక వైపు అవి డమ్మీ కంపెనీలని రాతలు రాశారని, వాటికే నష్టమంటూ కథనాలు ప్రచురించారని సాక్షి ఈనాడు కథనంపై వ్యాఖ్యానించింది. తొలుత షేర్లు కొన్న కంపెనీలను షర్మిళకు ముడిపెట్టి విషప్రచారం సాగించిందని తప్పు పట్టింది. ఉప ఎన్నికల సమయంలో జగన్‌పై రామోజీ రోత రాతలు కొత్త కాదని, కడప ఎన్నికల్లో ఇదే కుతంత్రం చేశారని, ఇప్పుడూ అదే తీరు ప్రదర్శిస్తున్నారని సాక్షి దినపత్రిక అన్నది. షర్మిళకు చెందిన కంపెనీల్ల డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీలు జగతి పబ్లికేషన్స్ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి విక్రయించారని ఈనాడు కథా సారాంశమని అంటూ ఈనాడు దాన్ని ఎలా వక్రీకరించింది సాక్షి దినపత్రిక వివరించింది.












Click it and Unblock the Notifications