నిలదీద్దామంటే సోనియా పారిపోయారు: విజయశాంతి

తెలంగాణకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే ద్రోహం చేశాయని ఆమె అన్నారు. ప్రజలు తరిమికొడుతున్నా సీమాంధ్ర పార్టీలకు బుద్ది రావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నాయని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబడితే తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆమె అడిగారు.
తెలంగాణ కోసం తమ పార్టీ ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు. మాయమాటలు చెప్పి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తెలంగాణ అంశాన్ని పూర్తిగా విస్మరించాయని ఆమె అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications