వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్‌జీ అనుచరురాలు సుచిత్ర లొంగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishenji
కోల్‌కత్తా: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఎన్‌కౌంటర్ సమయంలో పారిపోయిన సుచిత్ర మహతో శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు లొంగిపోయారు. కిషన్‌జీ ముఖ్య అనుచరురాలు సుచిత్రా మహతో, ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు. ప్రభుత్వానికి, తన సోదరసోదరీమణులకు (మావోయిస్టులకు) ఇది గొప్ప విజయమని మమతా బెనర్జీ సుచిత్రో మహతో లొంగుబాటుపై వ్యాఖ్యానించారు. రైటర్స్ బిల్డింగ్‌లో తనను కలవడానికి ముందు సుచిత్రో మహతో నిఘా విభాగం మందు లొంగిపోయినట్లు ఆమె తెలిపారు.

సుచిత్ర గాయపడిందని, ఆమెకు చికిత్స అవసరమని, ప్రభుత్వ శాంతి ప్రక్రియకు ప్రతిస్పందించిన కొత్తగా పెళ్లి చేసుకున్న తన భర్త ప్రబీర్ గరాయ్‌తో కలిసి లొంగిపోయేందుకు వచ్చిందని ఆమె చెప్పారు. సుచిత్ర ఇంతకు ముందు శషాధర్ మహతోను వివాహమాడింది. అతను నిరుడు మార్చి 10వ తేదీన ఎదురుకాల్పుల్లో మరణించాడు.

కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై మమతా బెనర్జీ స్పందిస్తూ - తాము కావాలని చేయలేదని, ఆ సంఘటన పరిణామక్రమంలో జరిగిపోయిందని, తాను ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నానని, మరణమేదైనా దురదృష్టకరమేనని అన్నారు.

English summary
Suchitra Mahato, who had escaped after the Maoist topgun, Kishenji, was killed last year, surrendered on Friday with West Bengal Chief Minister Mamata Banerjee claiming the injured ultra responded to her government’s “offer of peace“.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X